
పి.గన్నవరం పుష్కరఘాట్‌ సమీపంలో నిమజ్జనం చేసే ప్రదేశం పి.గన్నవరం, అంబాజీపేట, న్యూస్‌టుడే: వాడవాడలా గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నేటినుంచే నిమజ్జనాల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. నిబంధనలు పాటించకపోవడం, అత్యుత్సాహం కారణంగా ఉమ్మడి జిల్లాలో ఏటా పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో లంబోదరుడిని గంగ ఒడికి చేర్చే సమయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. నిబంధనలు పాటించాలని కోరుతున్నారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఇప్పటికే రక్షణ చర్యలు చేపడుతున్నారు. ఉత్సవ కమిటీలకు సూచనలు చేశాం.. - రాహుల్‌మీనా, ఎస్పీ గుర్తి ంచిన ప్రదేశాల వద్దే నిమజ్జనం చేయాలి. జిల్లాలో 2,100 విగ్రహాలను నిమజ్జనం చేయనున్నారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కొన్ని ప్రదేశాల వద్ద గజ ఈతగాళ్లను ఏర్పాటు చేస్తున్నాం. వివిధ శాఖల సమన్వయంతో బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తాం. ఉత్సవ కమిటీలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





