
చిన్నంబావి: వనపర్తి జిల్లా చిన్నంబావి మండల సర్వసభ్య సమావేశం జరుగుతుండగా ఏపీఎం అనిల్ స్పృహ తప్పి కింద పడిపోయాడు. సమావేశం ప్రారంభం అయిన కొద్దిసేపటికే రికార్డులో సంతకం చేస్తుండగా స్పృహ తప్పి కుర్చీ మీద నుంచి ముందుకు పడిపోయాడు. దీంతో వెంటనే స్పందించిన తహసీల్దార్ శ్రీనివాస్ సీపీఆర్ చేయడంతో స్పృహలోకి వచ్చాడు. అనంతరం అంబులెన్స్‌లో కొల్లాపూర్‌కి తరలించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





