
ఆవిరి కుడుములంటే గణనాథుడికి మహా ఇష్టం. అందుకే వినాయక చవితి రోజున మోదకాలు చేసి ఆ పార్వతీ నందనుడికి నివేదిస్తాం. సాధారణంగా వీటిని బియ్యప్పిండితో తయారుచేస్తాం. అందులో స్టఫింగ్ కోసం కొబ్బరి తురుము, బెల్లం, నెయ్యి, డ్రైఫ్రూట్స్.. వంటివి వాడతాం.
ఆవిరి కుడుములంటే గణనాథుడికి మహా ఇష్టం. అందుకే వినాయక చవితి రోజున మోదకాలు చేసి ఆ పార్వతీ నందనుడికి నివేదిస్తాం. సాధారణంగా వీటిని బియ్యప్పిండితో తయారుచేస్తాం. అందులో స్టఫింగ్ కోసం కొబ్బరి తురుము, బెల్లం, నెయ్యి, డ్రైఫ్రూట్స్.. వంటివి వాడతాం. అయితే రుచికరమైన కుడుముల తయారీలో వాడే కొన్ని పదార్థాలు ఆరోగ్యానికీ ఎంతో ప్రయోజనకరం అంటున్నారు పోషకాహార నిపుణులు.
⚛ మోదకాల తయారీలో వాడే నెయ్యిలో ప్రధానంగా విటమిన్ ఎ, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు.. వంటి పోషకాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయట. ఇవి గుండె, కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయంటున్నారు నిపుణులు.
⚛ కొబ్బరిలోని పోషకాలు రక్తప్రసరణ సవ్యంగా ఉండేలా సహకరిస్తాయట.
⚛ ఇక స్టఫింగ్ కోసం ఉపయోగించే డ్రైఫ్రూట్స్లో మంచి కొవ్వులు అధికంగా ఉంటాయట. ఇవి శరీర బరువును అదుపులో ఉంచుకోవడానికి సహాయపడతాయట. అలాగే వీటి తయారీలో ఉపయోగించే బియ్యం, బెల్లం.. మొదలైన వాటిలో కూడా వివిధ పోషకాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
For Editorial Feedback eMail:
For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in
Powered By Margadarsi Computers
This website follows the DNPA Code of Ethics .
Privacy and cookie settings




