
ఆవర్తన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. నేటి నుంచి సెప్టెంబరు 22 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 19, 20 తేదీల్లో ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉండటంతో ఆయా జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయవచ్చునని పేర్కొంది. హైదరాబాద్లో మాత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందన్నారు.





