
భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లాలో సోమవారం తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తోంది. పలు మండలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదైంది. మండలకేంద్రమైన తుర్కపల్లిలో అత్యధికంగా 100.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. రాజాపేట మండలం పాముకుంటలో 68.0 మి.మీ., బొమ్మలరామారం మండలం మార్యాలలో 30.8 మి.మీ., బొమ్మలరామారంలో 25.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. రాజాపేటలో 13.5, బీబీనగర్‌ మండలం వెంకిర్యాలలో 11, భువనగిరి మండలం హన్మాపూర్‌లో 6.5, బీబీనగర్‌లో 4.8, గుండాలలో 4.3 మి.మీ. వర్షం కురిసింది. అలైర్‌ మండలం కోలనుపాకలో 2.5, మోత్కూర్‌లో 1.8, ఆత్మకూర్‌ (ఎం)లో 0.8, చౌటుప్పల్‌, షారాజీపేట, భువనగిరి కలెక్టరేట్‌ ప్రాంతాల్లో 0.5 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. వర్షాలతో జిల్లాలో వాతావరణం చల్లబడటంతోపాటు వ్యవసాయ పనులకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




