

- టీ-కాంగ్రెస్‌కు కొత్త ఇంచార్జ్
- మీనాక్షి నటరాజన్ విదేశీ చదువులు
- రేసులో తమిళనాడు ముఖ్య నేతలు
Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మీనాక్షి నటరాజన్‌ను అధిష్టానం త్వరలోనే మార్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉన్నత చదువుల నిమిత్తం ఆమె విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతుండటంతో, తెలంగాణకు(Telangana Congress) కొత్త ఇంచార్జ్‌ను నియమించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు ముమ్మరం చేసింది.
AP Government: ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఉద్యోగాల వయోపరిమితి భారీగా పెంపు.. ప్రభుత్వ కీలక ఉత్తర్వులు!
మీనాక్షి నటరాజన్ స్థానంలో కొత్త ముఖం:
మీనాక్షి నటరాజన్ గతంలోనే పది నెలల పాటు విదేశాల్లో విద్యను అభ్యసించారు. ప్రస్తుతం మరోసారి చదువు కోసం విదేశాలకు వెళ్లాల్సి ఉండటంతో పార్టీ నాయకత్వాన్ని ఒప్పించి అనుమతి తీసుకున్నట్లు తెలుస్తోంది. మరో రెండు నెలల పాటు ఆమెనే పదవిలో కొనసాగించే అవకాశం ఉన్నప్పటికీ, ఆ తర్వాత కొత్త ఇంచార్జ్ రాక ఖాయంగా మారింది. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్‌ను సమర్థవంతంగా నడిపించగల సీనియర్ నేత కోసం అధిష్టానం వేట ప్రారంభించింది.
రేసులో ముఖ్య నాయకులు.. ఎవరికి దక్కేను?
కొత్త ఇంచార్జ్ రేసులో తమిళనాడుకు చెందిన ముఖ్య నేతల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. రాహుల్ గాంధీ కోటరీలో కీలక సభ్యుడిగా, గాంధీ కుటుంబానికి అత్యంత విధేయుడిగా ఉన్న ఎంపీ జోతిమణి సెంథిల్ పేరు ముందు వరుసలో ఉంది. ఆయనతో పాటు తమిళనాడుకే చెందిన మాజీ ఎంపీ చెల్లకుమార్, సీనియర్ నేత ముకుల్ వాసనిక్ పేర్లను కూడా పార్టీ పరిశీలిస్తోంది. ముఖ్యంగా వాసనిక్కు తెలంగాణ కాంగ్రెస్ నాయకులతో మంచి సంబంధాలు ఉన్నప్పటికీ, తమిళనాడు నేతలకే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.





