
Rising Demand, Supply Disruptions ఎల్‌నినో ప్రభావం విద్యుత్ వినియోగంపై పడింది. దీంతో ఎన్నడూ లేని విధంగా జిల్లాలో వాడకం పెరిగింది. ఆశించిన స్థాయిలో వర్షాలు కురకపోవడం, వేసవిని తలపించేలా ఎండ ఠారెత్తిస్తుండడంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అడపాదడపా వానలు కురుస్తున్నా.. వాతావరణంలో వేడి, ఉక్కపోత మాత్రం తగ్గడం లేదు. దీంతో గతేడాదితో పోలిస్తే జిల్లాలో విద్యుత్ వాడకం గణనీయంగా పెరిగింది. ఇంధన సంస్థలు డిమాండ్ మేరకు విద్యుత్‌ను సరఫరా చేయలేక సతమతమవుతున్నాయి. దీంతో ‘ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్’ పేరుతో అప్ర





