
తెలంగాణలో భూములకు సంబంధించి 22Aపై పొలిటికల్ హీట్ పెంచిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై అసెంబ్లీలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్. రాష్ట్రంలో నిషేధిత జాబితాలో ఉన్న భూములన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెట్టినవే అని అన్నారు. దళారులు, బీఆర్ఎస్ నేతలు అంతా ఒక్కటేనని అన్నారు సీఎం రేవంత్.





