
హైదరాబాద్‌: అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి అబద్ధాలు చెప్పారని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత విమర్శించారు. ‘‘నా కుటుంబానికి ఎక్కడో భూములు ఉన్నట్టు సీఎం చెప్పారు. ప్రభుత్వ నిబంధనలను మించి ఒక్క గజం భూమి నాకు ఎక్కువగా ఉన్నా, ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న భూమికంటే ఎక్కువ ఉన్నా ప్రభుత్వానికే ఇస్తా. సీఎం చదివిన భూముల చిట్టాపై నిజాలు నిగ్గు తేలాలి. అందు కోసం సీబీఐ విచారణకు ఆదేశించాలి’’ అని కవిత డిమాండ్‌ చేశారు.