
హైదరాబాద్‌: తాజ్‌ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్‌ రహీమ్‌ అగాఖాన్‌-Vతో సీఎం రేవంత్‌రెడ్డి ( Revanth Reddy ) భేటీ అయ్యారు. గ్లోబల్‌ సమిట్‌కు హాజరుకావాలని ఆయన్ను సీఎం ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ అగాఖాన్‌ ఫౌండేషన్‌పై అత్యంత గౌరవముందని చెప్పారు. ‘‘వారసత్వ సంపదను పునరుద్ధరించడంలో అగాఖాన్‌ ఫౌండేషన్‌ది అత్యంత కీలకపాత్ర. ఫౌండేషన్‌ సాయంతో మండలి భవనం, కుతుబ్‌ షాహీ టూంబ్స్‌ను పునరుద్ధరించుకున్నాం. మూసీ నది పునరుజ్జీవం కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. సిటీ కాలేజ్‌, ఉస్మానియా ఆస్పత్రి భవనాల పునరుద్ధరణకు సాయం కోరుతున్నాం. డిసెంబర్‌ 7, 8, 9 తేదీల్లో ఫ్యూచర్‌ సిటీలో గ్లోబల్‌ సమిట్‌ నిర్వహిస్తున్నాం. 100కు పైగా దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతారు’’అని సీఎం తెలిపారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. హైదరాబాద్‌లో ఖైరతాబాద్‌ గణేశుడు తర్వాత అంతటి ప్రసిద్ధి బాలాపూర్‌ గణపయ్య (Balapur Ganesh)కే దక్కుతుంది. ఈ ఏడాది ఇక్కడ పూరీ (Puri) జగన్నాథుడి ఆలయం నమూనాలో 18 అడుగుల వినాయకుడు భక్తులకు దర్శనమిస్తున్నాడు. హైదరాబాద్‌లోని కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ ట్రాఫిక్‌ సమస్యకు చెక్‌ పెట్టేందుకు తలపెట్టిన ‘హెచ్‌ సిటీ’ ప్రాజెక్ట్‌ పనులపై జీహెచ్‌ఎంసీ పునరాలోచిస్తోందని సమాచారం.