
Rahul Gandhi : బ్రిక్స్ సదస్సు కోసం ఇండియా వచ్చిన మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం.. ఢిల్లీలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కలిశారు. అక్కడే రాహుల్ సోదరి ప్రియాంకా గాంధీని కూడా కలుసుకున్నారు. బ్రిక్స్ కూటమిలో మలేసియా కూడా భాగస్వామిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సదస్సు కోసం మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఇండియా చేరుకున్నారు. శని, ఆదివారం జరిగిన బ్రిక్స్ సదస్సులో పాల్గొన్నారు. అనంతరం ఢిల్లీలో.. దివంగత ప్రధాని మన్మోహన్ సింగ్‌కు నివాళి అర్పించారు. అనంతరం ఉదయం ఢిల్లీలోని రాహుల్ గాంధీ నివాసంలో ఆయనను కలిశారు. బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్ కోసం రాహుల్‌ను అన్వర్ ఇబ్రహీం భేటీ అయ్యారు. రాహుల్ నివాసంలో ఆయన సోదరి ప్రియాంకా గాంధీ కూడా ఉన్నారు. వారితో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. దీనికి సంబంధించిన ఫొటోల్ని కాంగ్రెస్ తాజాగా విడుదల చేసింది. బ్రిక్స్ కూటమిలో మలేసియా సభ్య దేశం. LoP Shri @RahulGandhi and Congress General Secretary Smt. @priyankagandhi ji met H.E. Dato’ Seri @anwaribrahim , Prime Minister of Malaysia today. 📍New Delhi pic.twitter.com/EV9PIDizwZ — Congress (@INCIndia) September 13, 2026 మలేసియాతో ఇండియాకు సత్సంబంధాలున్నాయి. బ్రిక్స్ సదస్సు కోసం ఇండియా వచ్చిన ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో శనివారం సాయంత్రం మోదీ భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య సంబంధాలపై కీలక చర్చలు జరిపారు. ప్రధానంగా సెమీ కండక్టర్స్, వ్యాపారం, రక్షణ వంటి అంశాలపై చర్చించారు. అన్వర్ ఇబ్రహీం తన పర్యటన సందర్భంగా దివంగత ప్రధాని మన్మోహన్ సింగ్‌ను గుర్తు చేసుకున్నారు. ఆయనతో తనకున్న సాన్నిహిత్యం గురించి ప్రస్తావించారు.






