
పసిఫిక్‌ మహాసముద్రంలోని ఫిజీ ద్వీప దేశం.. స్నేహపూర్వక సంస్కృతి, అందమైన బీచ్‌లు, పగడపు దిబ్బలకు ప్రసిద్ధి. కానీ, ఈ దేశం ఇప్పుడు హెచ్‌ఐవీ వ్యాప్తితో వణికిపోతోంది. కేసుల సంఖ్య పెద్దఎత్తున పెరుగుతుండటంతో అక్కడి ప్రభుత్వం ‘నేషనల్‌ హెచ్‌ఐవీ ఎమర్జెన్సీ’ని ప్రకటించింది. 10 లక్షల్లోపే జనాభా ఉన్న ఫిజీలో ప్రస్తుతం ప్రతి 60 మంది వయోజనుల్లో ఒకరు ఈ వైరస్‌తో బాధపడుతున్నట్లు అంచనా. 👉 మరిన్ని వివరాలు





