
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ‘చేయూత’ కొత్త పింఛన్ల దరఖాస్తు గడువును ప్రభుత్వం మరో రోజు పొడిగించింది. వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చిన నేపథ్యంలో బుధవారం సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకునేలా వెసులుబాటు కల్పిస్తూ సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ నిర్ణయం తీసుకున్నారు





