
ఉద్యమ నాయకుడు కేసీఆర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి అవమానించారని బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు విమర్శించారు. తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడారు. ‘‘22ఏ తప్పును సరిచేసుకోవాల్సిన పాలకులు విపక్షంపై ఎదురుదాడి చేస్తున్నారు. భూభారతిలో ఒక జిల్లాకు సంబంధించి రూ.80 లక్షల విలువైన చలాన్ల స్కామ్‌ జరిగింది. కానీ ఎవరిపైనా చర్యలు లేవు. భూభారతి ద్వారా ప్రజలకు తెలియకుండానే ప్రజల ఆస్తి.. మరొకరికి బదిలీ అయ్యింది. అందులో ఇప్పటికే 9,200కు పైగా అక్రమ లావాదేవీలు జరిగాయి’’ అని అన్నారు. 👉 మరిన్ని వివరాలు





