
రాష్ట్రంలో మొత్తం రూ.లక్ష కోట్ల భూ కుంభకోణం జరిగిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. భూ కుంభకోణంపై స్పెషల్‌ ఎంక్వయిరీ టీమ్‌ (ఎస్‌ఈటీ) ఏర్పాటు చేస్తామన్నారు. మొత్తం భూ కుంభకోణంపై నెల రోజుల్లో నిగ్గు తేలుస్తామని చెప్పారు. ‘‘ఇప్పటి వరకు చెప్పింది ధరణి పార్ట్‌-1 మాత్రమే. త్వరలోనే ధరణి పార్ట్‌-2 అక్రమాలు బయటపెడతాం. బీఆర్‌ఎస్‌ సభ్యులు సభలో ఉన్నప్పుడే అన్నీ బయటపెడతాం. ఈ సారి సమావేశాలకు బీఆర్‌ఎస్‌ సభ్యులు వచ్చేలా స్పీకర్‌ చూడాలి. నా కళ్లలోకి చూసి మాట్లాడే ధైర్యం వాళ్లకు ఉండదు’’ అని అన్నారు.





