
భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణం తారకరామ్ నగర్‌లోని శ్రీ మణికంఠ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. అయ్యప్ప స్వామి రూపంలో వినాయకుడు భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. అయ్యప్ప స్వామి చరిత్ర అర్థమయ్యే విధంగా వివిధ విగ్రహాలను రూపొందించారు. వినాయకుడి మండపాన్ని కూడా శబరిమల తరహాలో తీర్చిదిద్దడం ఆకట్టుకుంటోంది. ఈ వార్త చదివారా: సీఎం రేవంత్‌రెడ్డితో నాకు గొడవల్లేవ్‌: మహేశ్‌కుమార్‌ గౌడ్‌





