
పశ్చిమాసియా ఉద్రిక్తతలు సౌదీఅరేబియాలోని ముస్లింల పవిత్రస్థలం మక్కాను తాకాయి. ఈ నగరం సమీపంలోకి ఒక డ్రోన్ దూసుకురావడమే అందుకు కారణం. అయితే దానిని కూల్చివేశామని సౌదీ అరేబియా తాజాగా వెల్లడించింది. సౌదీ అరేబియా-హూతీల తిరుగుబాటుదారుల మధ్య కొన్నిరోజులుగా తీవ్ర ఘర్షణలు జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇది హూతీల పనేనని సౌదీ ఆరోపించగా.. ఆ వాదనను తిరుగుబాటు గ్రూప్ ఖండించింది.





