
ఇంగ్లాండ్ చేతిలో మూడు టెస్టుల సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైన పాకిస్థాన్‌ జట్టుకు ఐసీసీ డబుల్ షాక్ ఇచ్చింది. ఇటీవల జరిగిన మూడో టెస్టులో స్లో ఓవర్‌ రేట్ కారణంగా పాకిస్థాన్ ఆటగాళ్ల మ్యాచ్‌ ఫీజులో 50 శాతం జరిమానా విధించింది. అంతేకాకుండా ప్రస్తుత ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో పాక్‌కు 11 పాయింట్ల కోత విధించింది. దీంతో డబ్ల్యూటీసీలో పాక్ అట్టడుగుకు (తొమ్మిదో స్థానం) పడిపోయింది. ప్రస్తుతం ఆ జట్టు పాయింట్ల శాతం 4.63 మాత్రమే.





