
దేశీయ మదుపర్లు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ పబ్లిక్‌ ఇష్యూ (NSE IPO) పట్టాలెక్కనుంది. సెప్టెంబరు 17న సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభమై.. 21వ తేదీన ముగియనుంది. షేర్ల ప్రైస్‌బ్యాండ్‌ రూ.1,700 నుంచి రూ.1,785గా కంపెనీ నిర్ణయించింది. ట్రేడింగ్‌ పరిమాణంలో ప్రపంచంలోనే అతిపెద్ద డెరివేటివ్స్‌ ఎక్స్ఛేంజ్‌ అయిన ఎన్‌ఎస్‌ఈ.. పబ్లిక్‌ ఇష్యూకు దాదాపు దశాబ్దం కిందటే రావాల్సింది. కోలొకేషన్‌ వివాదం, పాలనాపరమైన ఆందోళనల వల్ల ఆలస్యమైంది. ఏమిటీ కోలొకేషన్‌ వివాదం? తెలుసుకోవాలంటే.. వివరాలకు..





