
భారత్‌తో జరుగుతున్న తొలి టీ20లో నిర్ణీత 20 ఓవర్లకు అఫ్గానిస్థాన్‌ 156/8 స్కోరు చేసింది. అజ్మతుల్లా ఒమర్జాయ్‌ (64*) హాఫ్‌ సెంచరీ బాదాడు. నబీ (33) మినహా మిగతావారంతా విఫలమయ్యారు. అర్ష్‌దీప్‌ సింగ్‌ 3 వికెట్లు, బుమ్రా, అక్షర్‌ పటేల్‌, వరుణ్‌ చక్రవరి తలో వికెట్‌ తీశారు. ఇబ్రహీం జద్రాన్‌ (11), నూర్‌ అహ్మద్‌ (0) రనౌటయ్యారు. ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌లో శివమ్‌ దూబే 21 పరుగులు ఇవ్వడం గమనార్హం.






