
పురుషుల జూనియర్‌ ఆసియా కప్‌ హాకీ టోర్నీ విజేతగా భారత్‌ నిలిచింది. ఫైనల్‌లో దక్షిణ కొరియాపై 4-1 తేడాతో విజయం సాధించింది. భారత్‌ తరఫున అజిత్‌ యాదవ్‌, అన్మోల్‌, ప్రభ్‌దీప్‌ సింగ్‌, అషు మౌర్య గోల్స్‌ చేశారు. కొరియా నుంచి లీ మిన్‌యోక్‌ ఒక గోల్‌ కొట్టాడు. ఈ విజయంతో జూనియర్ ప్రపంచ కప్‌లో భారత్‌కు స్థానం ఖరారైంది. అంతకుముందు హాకీ మహిళల జూనియర్‌ ఆసియా కప్‌నూ భారత్‌ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.






