

Samantha : సమంత ఇటీవల ప్రగ్నెంట్ అయిన విషయం అందరికి తెలిసిందే. తాజాగా సమంతకు తను పూజించే ఈషా ఆశ్రమంలోని లింగ భైరవి అమ్మవారి వద్ద సీమంతం వేడుక నిర్వహించారు. ఈ వేడుక కొత్తగా ఉంది. దీనికి సంబంధించిన పలు ఫొటోలు, వీడియోలు సమంత తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. అలాగే ఈ సీమంతం వేడుక గురించి కూడా సమంత వివరించింది.
ఈ సీమంతం వేడుకను ‘గోద్ భరాయి’ అని పిలుస్తారని తెలిపింది. సమంత తన సీమంతం వేడుక గురించి తన పోస్ట్ లో.. మంత్రోచ్ఛారణ ద్వారా వెలువడే శక్తిలో, తరాలుగా ఎంతో శ్రద్ధతో అనుసరిస్తున్న ప్రాచీన ఆచార విధానాల్లో లోతైన భావం దాగి ఉందని నాకు అనిపిస్తుంది. కళావరణం (శ్రీకల్పం) అనేది శ్రీవిద్య సంప్రదాయానికి చెందిన ఒక క్రతువు. ఈ ప్రత్యేక ఆచారంలో దేవి 94 కళలను స్మరిస్తూ, తల్లి శరీరంలోని ఏడు చక్రాలను శ్రీవిద్య ఉపాసకులు మంత్రోచ్ఛారణ చేస్తూ, పవిత్ర జలంతో గర్భిణి అయిన మహిళకు అభిషేకం చేస్తారు. దీని ద్వారా అమ్మవారి దివ్య గుణాలు ఆ మహిళలో చైతన్యం నింపుతాయని భావిస్తారు. ఈ ప్రక్రియలో తనలో మరో ప్రాణానికి రూపమిస్తున్న సృష్టికర్తగా తల్లిని గౌరవించడం అనేది నాకు నచ్చింది. ఇది గర్భంలో పెరుగుతున్న బిడ్డకు ఆశీర్వాదం మాత్రమే కాదు. తల్లిగా కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న మహిళకు ఆశీర్వచనమే. అభిషేకం తర్వాత తల్లి కాబోతున్న మహిళను శ్రీచక్ర యంత్రంలో కూర్చోబెడతారు. దేవీ ఖడ్గమాల పారాయణ, మంత్ర జపంతో మనస్సును అంతర్ముఖం చేస్త్తారు. ఈ మంత్రోచ్ఛారణ కారణంగా తల్లీ బిడ్డలకు ఒక రక్షణ కవచం ఏర్పడుతుందని నమ్మకం. ఈ అనుభూతి ఎంతో శక్తిమంతంగా అనిపించింది అని తెలిపింది.
Also Read : Sampoornesh Babu : ఇకపై హీరోగా సినిమాలు చేయను.. సంపూర్ణేష్ బాబు కామెంట్స్ వైరల్..
దీంతో సమంత సీమంతం సాంప్రదాయం చర్చగా మారింది. గతంలో భూతశుద్ధి పద్ధతిలో సమంత, రాజ్ నిడిమోరు అక్కడే ఈషా ఆశ్రమంలో లింగభైరవి అమ్మవారి దగ్గరే వివాహం చేసుకున్నారు. ఇప్పుడు కూడా అక్కడే శ్రీవిద్య సాంప్రదాయంలో సమంతకు సీమంతం వేడుక నిర్వహించారు.




