
Dhee fame Pandu Accident ఢీ షో ద్వారా ఫేమస్ అయిన పండుకి ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. డ్యాన్సర్ పండు ఇక జీవితంలో నడుస్తాడా?లేదా? అన్న రేంజ్లో రెండు కాళ్లకి దెబ్బలు తగిలి, ఆపరేషన్ జరిగింది. ఇంకా పండు బెడ్డు మీదే ఉన్నాడు. నడించేందుకు ఇబ్బంది పడుతున్నట్టుగానే తెలుస్తోంది. అయితే అలా బెడ్డు మీద ఉన్న పండు.. తన కొత్త యూట్యూబ్ ఛానెల్ కోసం రిక్వెస్ట్ పెట్టుకున్నాడు. ఇన్ని రోజులు యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేయలేదు. ఇప్పుడు ఆదాయం కోసం యూట్యూబ్ ఛానెల్‌ని పండు ఓపెన్ చేసినట్టుగా తెలుస్తోంది.





