
వారణాసిలోని Banaras Locomotive Works (BLW) 2026-27 సంవత్సరానికి స్పోర్ట్స్ కోటా (ఓపెన్ అడ్వర్టైజ్మెంట్) కింద ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో స్పోర్ట్స్ కోటా కింద మొత్తం 25 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన క్రీడాకారుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 12, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నియామకాల్లో బాస్కెట్బాల్, వాలీబాల్, రెజ్లింగ్, హ్యాండ్బాల్ విభాగాలకు చెందిన క్రీడాకారులు దరఖాస్తు చేసుకోవచ్చు.





