
ఇంటర్నెట్‌ డెస్క్‌: జర్మనీ స్టార్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ యుఎస్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ విభాగంలో టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఫైనల్‌ మ్యాచ్‌లో అమెరికా కుర్రాడు బెన్‌ షెల్టన్‌ను 6-3, 7-6(2), 5-7, 6-2 తేడాతో ఓడించాడు. జ్వెరెవ్‌కు ఇది రెండో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌. చాలా ఏళ్ల్లుగా సర్క్యూట్‌లో ఉన్నా.. ఆలస్యంగా ఈ ఏడాదే ఫ్రెంచ్ ఓపెన్ (రోలాండ్ గారోస్)లో తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ గెలిచాడు. తాజాగా యుఎస్‌ ఓపెన్‌లో విజేతగా నిలిచి రెండో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు యూఎస్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌లో.. షెల్టన్‌ రూపంలో 23 ఏళ్ల తర్వాత స్థానికుడికి టైటిల్‌ వస్తుందన్న ఆశలు ఆవిరయ్యాయి. చివరగా అమెరికన్‌ క్రీడాకారుడు ఆండీ రాడిక్‌ 2003లో పురుషుల సింగిల్స్‌లో యుఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ సాధించాడు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌ను టీమ్‌ఇండియా ఘనంగా ఆరంభించింది.




