
Home » Sports » sabalenka racket smash after us open final loss to rybakina srav
యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను వరుసగా మూడోసారి గెలుచుకుని హ్యాట్రిక్ సాధించాలనుకున్న టెన్నిస్ స్టార్ అరీనా సబలెంకా ఆశలకు ప్రపంచ నంబర్ వన్ ఎలీనా రిబకినా చెక్ పెట్టింది.
ఇంటర్నెట్ డెస్క్: యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను వరుసగా మూడోసారి గెలుచుకుని హ్యాట్రిక్ సాధించాలనుకున్న టెన్నిస్ స్టార్ అరీనా సబలెంకా ఆశలకు ప్రపంచ నంబర్ వన్ ఎలీనా రిబకినా చెక్ పెట్టింది. ఫైనల్ పోరులో రిబకినా 6-4, 5-7, 6-2 తేడాతో సబలెంకాపై విజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచింది. అయితే ఫైనల్ ఓటమిని సబలెంకా జీర్ణించుకోలేకపోయింది. మ్యాచ్ పాయింట్ కోల్పోయిన వెంటనే తీవ్ర అసహనానికి గురైన ఆమె.. తన రాకెట్‌ను నేలకేసి బద్దలు కొట్టింది. ఆ తర్వాత తన భావోద్వేగాలను చిత్రీకరించేందుకు ప్రయత్నించిన కెమెరా పర్సన్‌పై కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ ఓటమితో 99 వారాలుగా కొనసాగుతున్న సబలెంకా ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్‌కు తెరపడింది. ఆమెను వెనక్కి నెట్టి రిబకినా నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. అయినప్పటికీ మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన సబలెంకా.. నిరాశలో కూరుకుపోకుండా వచ్చే సీజన్లో మరింత బలంగా తిరిగి వస్తానని స్పష్టం చేసింది. ‘ఈ టోర్నీలో నేను ఆడిన స్థాయికి సంతోషంగా ఉన్నా. ఈ టోర్నీ నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఈ సీజన్లో ఎదురైన అనుభవాలు ఇప్పటికే నన్ను మరింత బలంగా మార్చాయి. వచ్చే ఏడాది ఇంకా మెరుగ్గా రాణించేందుకు అవే నాకు ప్రేరణగా నిలుస్తాయి’ అని సబలెంకా వెల్లడించింది.
కజకిస్తాన్‌కు చెందిన ఎలీనా రెబకినాకి ఇది తన కెరీర్లో మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్. ఒకే ఏడాది రెండు గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌లో నంబర్ వన్ ర్యాంకర్‌ను ఓడించిన రెండో టెన్నిస్ ప్లేయర్‌గా రిబకినా రికార్డు సృష్టించింది. ఇంతకుముందు 1995లో స్టెఫీగ్రాఫ్ ఈ ఘనతను నమోదు చేసింది. ఇప్పుడు దాదాపు 31 ఏళ్ల తర్వాత రిబకినా ఈ ఫీట్ సాధించింది.
ఆల్‌టైమ్ బెస్ట్ కెప్టెన్ ఎవరో తేల్చేసిన రాహుల్ ద్రవిడ్!
భారత క్రికెట్ మహిళా ప్లేయర్ సంచలన నిర్ణయం






