
దేశవ్యాప్తంగా విస్తృతంగా వినియోగంలో ఉన్న యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) లావాదేవీలపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) కీలక ప్రకటన చేసింది. వ్యాపారులకు చేసే చెల్లింపులపై కొన్ని రుసుములను ప్రవేశపెట్టినప్పటికీ, ఆ భారం వినియోగదారులపై పడదని స్పష్టం చేసింది...





