
Nigar Sultana Steps Down: జపాన్‌లో ఆసియా క్రీడల పోటీలు ఆరంభం కానున్న తరుణంలో బంగ్లాదేశ్ మహిళల క్రికెట్ జట్టు నాయకత్వంలో కీలక మార్పు చోటుచేసుకోనుంది. టీ20 ఫార్మాట్ కెప్టెన్సీ బాధ్యతలను వదులుకోవాలని నిర్ణయించుకున్న నిగర్ సుల్తానా, ఈ విషయాన్ని బోర్డుకు అధికారిక లేఖ ద్వారా తెలియజేశారు. తన బ్యాటింగ్, వికెట్ కీపింగ్ నైపుణ్యాలపై మరింత ఏకాగ్రత పెట్టే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె స్పష్టం చేశారు. అయితే అంతర్జాతీయ వన్డే (One Day International – ODI) ఫార్మాట్లో మాత్రం ఆమె సారథిగా కొనసాగనున్నారు. బీసీబీ అధ్యక్షుడు తమీమ్ ఇక్బాల్ (Tamim Iqbal) ఆమె ప్రతిపాదనను ఆమోదించినట్లు సమాచారం. ఇటీవల ముగిసిన మహిళల ఆసియా కప్ 2026 (Women’s Asia Cup 2026) సందర్భంగా భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) తో టాస్ సమయంలో కరచాలనం చేయకపోవడం తీవ్ర చర్చనీయాంశమైన నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.




