
Monthly Income: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కింద తప్పనిసరి కవరేజీ కోసం నెలసరి జీత పరిమితిని రూ. 15,000 నుండి రూ. 25,000కు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. కార్మిక మంత్రిత్వ శాఖ ఈ ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గం అధికారికంగా ఆమోదించింది. 2014 తర్వాత EPFO వేతన పరిమితిలో ఇంత పెద్ద సవరణ చేయడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఈ కొత్త నిబంధన సెప్టెంబర్ 17, 2026 నుండి దేశవ్యాప్తంగా అమలులోకి వస్తుంది. దీంతో పాటు, మన దేశంలో నెలకు రూ. 25,000 లేదా అంతకంటే ఎక్కువ సంపాదించే వారు వాస్తవంగా ఎంతమంది ఉన్నారు అనే తీవ్రమైన, దిగ్భ్రాంతికరమైన ప్రశ్న కూడా తలెత్తింది.





