
ధరూరు: గత యాసంగిలో మిల్లులకు కేటాయించిన వరి ధాన్యం నిల్వలపై తనిఖీలు చేసి నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో పౌరసరఫరాల శాఖ, రెవెన్యూ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మిల్లులకు కేటాయించిన ధాన్యంలో సీఎంఆర్ కింద ప్రభుత్వానికి ఎంత బియ్యం అప్పగించారనేది పరిశీలించాలని సూచించారు. ధాన్యం నిల్వ లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





