
నారాయణపేట పట్టణం: నారాయణపేటలోని బ్రిలియంట్ ఉన్నత పాఠశాలలో బుధవారం ‘ఈనాడు - ఈటీవీ’ ఆధ్వర్యంలో విద్యార్థులకు ‘ఈనాడు’ ప్రతిభా పాటవ పోటీలు నిర్వహించారు. ‘సమాజంపై ఎల్‌నినో ప్రభావం-ఎదుర్కొనే మార్గాలు’ అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వ్యాసరచన పోటీల్లో 10వ తరగతి విద్యార్థులు అర్చన(ప్రథమ బహుమతి), వర్షిణి(ద్వితీయ బహుమతి), 9వ తరగతి విద్యార్థిని కల్యాణి(తృతీయ బహుమతి) ప్రతిభ చాటారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయిలు సాగర్ ప్రశంసా పత్రాలు, బహుమతులను అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రవి కుమార్, రాజేష్ గౌడ్, ప్రమోద్ కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





