
శంకరపల్లి: విద్యుదాఘాతంతో విద్యార్థి మృతి చెందిన ఘటన మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఇక్ఫాయ్ యూనివర్సిటీ సమీపంలోని ప్రైవేట్ వసతి గృహంలో ఉంటున్న ఆర్య (22) ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం రాత్రి వసతి గృహం వద్ద ఏర్పాటు చేసిన గణేష్ మండపం దగ్గర ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గురై అక్కడిక్కడే మృతి చెందాడు. వసతి గృహం, కళాశాల సిబ్బంది ఆర్య కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




