
వెల్దండ : వెల్దండ మండల కేంద్ర సమీపంలో సోమవారం సాయంత్రం ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై ఆటో డ్రైవర్ దాడి చేశారు. శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారిపై గల వెల్దండ రెవిన్యూ శివారులో కల్వకుర్తి నుంచి హైదరాబాద్‌కు అచ్చంపేట డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు బయలుదేరింది. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న కారును పక్కకు తప్పించేందుకు ఆర్టీసీ బస్సు ప్రయత్నిస్తుండగా.. అదే మార్గంలో హైదరాబాద్‌కు వెళ్తున్న తన ఆటోపైకి బస్సు దూసుకొచ్చిందని ఆర్టీసీ డ్రైవర్ మల్లేష్ యాదవ్‌పై ఆటో డ్రైవర్ కర్రతో దాడి చేశారు. ఆర్టీసీ డ్రైవర్ మల్లేష్ యాదవ్ వెల్దండ పోలీస్‌స్టేషన్‌లో ఆటో డ్రైవర్‌పై ఫిర్యాదు చేశారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





