
కేఎల్‌ఐ ప్రధాన కాలువ 120 కిలోమీటరు వద్ద నీరు ఇలా కల్వకుర్తి, న్యూస్‌టుడే: కేఎల్‌ఐ ప్రాజెక్టు ద్వారా ప్రధాన కాలువల వెంట కృష్ణా జలాలు పారడం లేదు. సాగు చేసిన పంటలకు మోటార్ల సాయంతో నీరందించి...కాపాడుకోవాలను కున్న రైతులకు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. శ్రీశైలం ప్రాజెక్టులో కృష్ణా జలాలు రోజు రోజుకు తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఆగస్టు 7న గుడిపల్లి జలాశయం నుంచి కాలువల వెంట పంట పొలాలకు కృష్ణా జలాలను వదిలారు. నెల రోజుల్లోనే మళ్లీ నీటిని వదలకుండా ఆపేశారేమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. యాసంగిలో వేరుసెనగను విత్తుకొనే సమయంలో అధికారులు కేఎల్‌ఐ కాలువ నుంచి కృష్ణా జలాలను ఆపటంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. 29వ పాకేజీ కాలువ నుంచి డీ-82 కాలువ ద్వారా కృష్ణా జలాలు వెల్దండ దాటి ముందుకు ప్రవహించలేదు. ఇంతలోనే కృష్ణా జలాల రాకకు అంతరాయం ఏర్పడటాన్ని రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. యాసంగి సాగుకు నీరు వదులుతారా..? లేదా..? ముందు చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




