
ఆదోని మార్కెట్: ఆదోని పట్టణం పురపాలక సంఘం పరిధిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటర్ల ముసాయిదా జాబితాను పుర కమిషనర్ నయూమ్ అహ్మద్ సోమవారం పట్టణ ప్రణాళిక అధికారులతో కలిసి విడుదల చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పునర్విభజన ద్వారా 52 వార్డులకు గాను 1,76,676 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో ఎస్టీ 1620, ఎస్సీ 25181, బీసీ 134802, ఇతరులు 15073 ఓటర్లుగా తేల్చారు. జాబితాలను ప్రభుత్వ కార్యాలయాలతోపాటు స్వర్ణ వార్డు సచివాలయ కేంద్రాల్లో బహిరంగంగా ప్రచురించామన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఓటర్లు జాబితాలను పరిశీలించి అభ్యంతరాలు, ఫిర్యాదులు సలహా సూచనలు ఇస్తే పరిగణలోకి తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో పట్టణ ప్రణాళిక అధికారి బాలమద్దయ్య, సిబ్బంది పాల్గొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





