
Aug 19 2026 8:14 AM | Updated on Aug 19 2026 8:14 AM
పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఫ్రీ స్కూల్ స్ట్రీట్ సమీపంలోని ఓ హోటల్లో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందగా.. మరో ఆరుగురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉన్నట్లు సమాచారం. ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది.
మిర్జా గాలిబ్ స్ట్రీట్‌లోని ఓ హోటల్లో రాత్రి సుమారు 2 గంటల సమయంలో మంటలు చెలరేగినట్లు సమాచారం. క్షణాల్లోనే మంటలు హోటల్లోని పలు ప్రాంతాలకు వ్యాపించాయి. దట్టమైన పొగ అలుముకోవడంతో హోటల్లో ఉన్నవారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పొగ పీల్చుకోవడంతో పలువురు స్పృహ కోల్పోయినట్లు తెలుస్తోంది.
కొనసాగుతున్న సహాయక చర్యలు సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. పలువురు ఫైర్ టెండర్లు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించాయి. అదే సమయంలో హోటల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు చేపట్టారు. పొగ కారణంగా తీవ్ర అస్వస్థతకు గురైన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
చుట్టుపక్కల హోటళ్లకూ మంటలు.. మంటలు ఒక్క హోటల్‌కే పరిమితం కాకుండా సమీపంలోని మరికొన్ని హోటళ్లకు కూడా వ్యాపించినట్లు సమాచారం. దీంతో ఫ్రీ స్కూల్ స్ట్రీట్, మిర్జా గాలిబ్ స్ట్రీట్ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరిస్తూ మంటలు మరింత విస్తరించకుండా చర్యలు చేపట్టారు.
వైద్యం కోసం వచ్చిన బంగ్లాదేశీయులు మృతి ఈ ఘటనలో మృతుల్లో పలువురు బంగ్లాదేశ్ పౌరులు ఉన్నట్లు సమాచారం. వైద్య చికిత్స కోసం కోల్‌కతాకు వచ్చిన వారు హోటల్లో బస చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతుల్లో చిన్నారి కూడా ఉండటంతో ఘటన మరింత విషాదకరంగా మారింది.
ప్రమాదానికి కారణం? అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ కారణమా? లేక మరేదైనా కారణమా? అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత హోటల్‌ను పరిశీలించి ప్రమాదానికి అసలు కారణాన్ని నిర్ధారించనున్నారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. మృతుల వివరాలు, గాయపడిన వారి పరిస్థితిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
కేబీఆర్ ట్రాఫిక్ ‘ట్రాప్’.. ఎటు వెళ్లాలో తెలియక జనం పరేషాన్!(చిత్రాలు)
చీరకట్టులో మంత్రముగ్ధం చేస్తున్న శ్రీలీల అందం ...(ఫొటోలు)
అదితి రావు స్టన్నింగ్ లుక్స్.. సిద్ధార్థ్‌తో స్పెషల్ మూమెంట్స్! (ఫొటోలు)
సినీ నటి అయేషా ఖాన్ నిశ్చితార్థం ...? (ఫొటోలు)
అదిరిపోయే లుక్స్‌తో రాశి ఖన్నా.. (ఫొటోలు)
అద్దంకి సాక్షిగా చెప్తున్నా... గంజాయి దొరికిన కార్ దగ్గరికి వెళ్లి చూస్తే..
వంద రోజుల్లో గంజాయి నిర్మూలిస్తామన్న హోంమంత్రి ఇప్పుడు ఎక్కడ ?
ఒక్కసారి అద్దంలో చూసుకో.. బొత్సపై అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు.. నాగమల్లీశ్వరి అదిరిపోయే కౌంటర్
అడ్డంగా బుక్కయ్యారు.. తండ్రీకొడుకులకు CBI ఫీవర్





