
మహారాష్ట్ర కొల్హాపూర్ జిల్లాలోని కవల్టెక్ ధంగర్వాడ గ్రామంలో ఒక జిల్లా పరిషత్ పాఠశాల ఉంది. ఆ స్కూల్‌కి 55 ఏళ్ల ఉపాధ్యాయుడు జీవన్ మిథారి ప్రతిరోజూ 5 కిలోమీటర్ల దట్టమైన అడవి గుండా కాలినడకన వెళ్తున్నారు. అడవి దున్నలు, చిరుతపులుల ప్రమాదం ఉన్నా కూడా గత 13 ఏళ్లుగా పాఠశాలకు హాజరవుతున్నారు. ఒకప్పుడు 100 కుటుంబాలు ఉన్న ఆ గ్రామం ఖాళీ అయినా, ఒక్క విద్యార్థి ఉన్నా సరే విద్యాబుద్ధులు నేర్పడమే తన బాధ్యత అని చాటిచెబుతున్న జీవన్ మిథారి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారు. మూడో తరగతి విద్యార్థిని స్వరా కోసం ఈ సాహసం చేస్తున్నారు.





