బుల్లితెర హిట్ జోడీ కావ్యశ్రీ, నిఖిల్ మలయక్కల్ బ్రేకప్ అయినా వారి పేర్లు మాత్రం ఇంకా కలిసే వినిపిస్తున్నాయి. గోరింటాకు సీరియల్ తో ప్రేమలో పడి, 5 ఏళ్లు రిలేషన్ షిప్ లో ఉన్న ఈ జంట, బిగ్ బాస్ 8 తర్వాత విడిపోయారు. నిఖిల్ బిగ్ బాస్ విన్నర్ అయ్యాక కూడా కావ్య గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. ఇప్పటికీ కావ్యశ్రీ ఎక్కడికి వెళ్లినా నిఖిల్ గురించే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో. నిఖిల్ తో మళ్లీ కలిసి నటిస్తారా అని కావ్యశ్రీని యాంకర్ అడిగారు. దానికి కావ్యశ్రీ షాకింగ్ రియాక్షన్ ఇచ్చింది. నేను నిఖిల్ ని రీసెంట్ గా కలవలేదు. ప్రస్తుతానికి అతడితో కలిసి నటించే ఆలోచన లేదు. మా ఇద్దరి లైఫ్ వేరు, ప్రొఫెషనల్ గా కూడా మేము విడిపోయామని క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు, తను సింగిల్ లైఫ్ నే ఎంజాయ్ చేస్తున్నానని చెప్పింది.
ఇటీవల సోషల్ మీడియాలో ఓ వైరల్ వీడియోపై కూడా కావ్యశ్రీ స్పందించింది. నిఖిల్, కావ్య కలిసి ఓ ఈవెంట్ లో ఉన్నట్లుగా ఉన్న పాత వీడియోను కొందరు రీసెంట్ వీడియోగా షేర్ చేశారు. అది పాత వీడియో, ఇప్పటిది కాదు. మేము ఇప్పుడు కలవడం లేదు. ఫేక్ వీడియోలను నమ్మొద్దని కావ్యశ్రీ క్లారిఫై చేసింది. గతంలో నిఖిల్ కూడా.. నన్ను ఎవరి పోస్టులకు ట్యాగ్ చేయొద్దు, ఎవరి జీవితం వారిది అని పోస్ట్ పెట్టాడు. బిగ్ బాస్ హౌస్ లో నిఖిల్ .. ఆరేళ్ళ ప్రేమను మరిచిపోలేను.. నువ్వు నా భార్యవి, బయటకు వచ్చాక నిన్ను కలుస్తానని కన్నీళ్లు పెట్టుకున్నాడు. కానీ బయటకు వచ్చాక పరిస్థితి మారింది. కావ్యశ్రీ ఇన్ స్టా లో ఇండైరెక్ట్ గా కౌంటర్లు వేసింది. తాజాగా స్టార్ మా పరివారం, సుమ అడ్డా, సర్కార్ 5 షోలలో కావ్యశ్రీ.. సింగిల్ లైఫే బెటర్, ప్రేమ అనే పేపర్ ని మంటల్లో వేస్తానని చెప్పింది. నిఖిల్ కూడా.. ప్రేమలో మోసపోయానని చెప్పడంతో వీరి మధ్య గ్యాప్ క్లియర్ అయింది.
కావ్యశ్రీ ప్రస్తుతం తెలుగు సీరియల్స్ తో బిజీగా ఉంది. 'గువ్వా గోరింక', 'బ్రహ్మముడి' లాంటి షోలతో పాటు యూట్యూబ్ ఛానల్ కూడా నడుపుతోంది. బిగ్ బాస్ సీజన్-9 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తుందని రూమర్లు వచ్చాయి. కానీ అది జరుగలేదు. నిఖిల్ మాత్రం సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ట్రై చేస్తున్నాడు. ఇద్దరు తమ కెరీర్ పై ఫోకస్ పెట్టారు. ఫ్యాన్స్ మాత్రం ఇప్పటికీ..వీళ్ళిద్దరు కలవాలని కామెంట్స్ చేస్తున్నారు. కానీ కావ్యశ్రీ మాత్రం.. రిటర్న్ ఇచ్చేస్తా.. ఆ రిలేషన్ నచ్చలేదని గతంలోనే చెప్పింది. ఇప్పుడు మళ్లీ కలిసి నటించే ప్రశ్నకు.. నో అని చెప్పడంతో వీరి కాంబోకు ఫుల్ స్టాప్ పడినట్లే అని అర్థమవుతోంది.
[Kavya Shree On Nikhil Maliyakkal, Kavya Shree Breakup Clarification, Gorintaku Serial Jodi, Bigg Boss 8 Winner Nikhil, Kavya Shree viral video]
Brahmamudi : చలపతి ఇంటికి సిరిని తీసుకెళ్లిన రాజు.. ఇందు ఇంట్లో రేఖ రచ్చ!
Brahmamudi : చలపతి ఇంటికి సిరిని తీసుకెళ్లిన రాజు.. ఇందు ఇంట్లో రేఖ రచ్చ!
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com
Disclaimer : All content on this website, including text, images, videos, graphics, and audio, is the intellectual property of ObjectOne Information Systems Ltd. and/or its affiliates. Any unauthorized reproduction, distribution, modification, or publication of this material, in whole or in part, is strictly prohibited without prior written consent from ObjectOne Information Systems Ltd.






