
వారణాసి: ప్రధాని నరేంద్ర మోదీని ( PM Modi ) ఆయన మాతృమూర్తి, దివంగత హీరా బెన్‌ ఆశీర్వదిస్తున్నట్లు కాశీకి చెందిన ఓ కళాకారుడు రూపొందించిన హస్తకళా చిత్రం ఆకట్టుకుంటోంది. ఈ నెల 17న మోదీ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు బహుమతిగా దీన్ని తయారు చేశారు. శ్రీరాముడి కాలం నాటిదిగా చెబుతున్న ‘ఉచంద్‌ కళ’ స్ఫూర్తితో.. సర్వేశ్‌కుమార్‌ శ్రీవాస్తవ అనే కళాకారుడు పట్టుదారాలతో దీన్ని అల్లారు. మరో ఇద్దరు కళాకారులతో కలిసి సుమారు నెలన్నర పాటు శ్రమించి.. ఈ ప్రత్యేక కళాకృతిని రూపొందించారు. శ్రీవాస్తవ గతంలోనూ మోదీకి బహుమతులు పంపారు. అయోధ్య రామమందిరం, క్రికెట్‌ ప్రపంచ కప్ థీమ్ ఆధారిత డిజైన్లతో కూడిన చీరలనూ తయారు చేశారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.