
బెంగళూరు (చిత్రదుర్గ): వినాయక చవితి పర్వదినం సందర్భంగా సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తన సొంత నియోజకవర్గం కనకపురలో పర్యటించారు. పలు గ్రామాల్లో వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్నారు. శివకుమార్ కుటుంబసభ్యులతో కలిసి పర్వదిన వేడుకల్లో, పెద్దల పండగలో పాల్గొన్నారు. తర్వాత చిక్కెగౌడ దొడ్డి గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయక చవితి పూజకు హాజరయ్యారు. మధ్యాహ్నం కనకపుర ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థులతో పాటు సహపంక్తి భోజనాలు చేశారు. వసతి గృహంలో ఉన్న సమస్యల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకొన్నారు. సమస్యలను పరిష్కరించాలని అధికారులన ఆదేశించారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత శివకుమార్ తమ ఊరికి విచ్చేసినందుకు గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేశారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.