
శంకరపట్నం: మండలంలోని తాడికల్ గ్రామ శివారు ఎల్లమ్మ దేవి ఆలయంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు అమ్మవారి ఆలయంలో చొరబడి హుండీ ధ్వంసం చేసి అందులో భక్తులు సమర్పించిన కానుకలు ఎత్తుకెళ్లారు. సోమవారం ఉదయం వేళలో పూజారి దేవాలయం వద్దకు వెళ్లేసరికి హుండీ పగలగొట్టి ఉండడం, అమ్మవారి సన్నిధిలో సామాగ్రి చిందరవందరగా పడేసిన తీరుతో దొంగతనం జరిగినట్లు గుర్తించారు. గౌడ సంఘం అధ్యక్షుడు మొలుగూరి తిరుపతి గౌడ్ ఆలయంలో చోరీ విషయమై పోలీసులకు సమాచారం అందించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





