
పారిస్‌లో జరగనున్న ఎఫ్ఏటీఎఫ్ సమీక్ష భయంతో పాకిస్థాన్ ప్రభుత్వం జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజార్‌పై రివార్డును 7 మిలియన్ల పిఆర్కే (భారత కరెన్సీ ప్రకారం రూ.24.09 లక్షలు)కు పెంచింది. ఎఫ్ఐఏ విడుదల చేసిన 2026 మోస్ట్ వాంటెడ్ జాబితాలో కూడా ఇతడి పేరును చేర్చారు. భారత పార్లమెంట్, పుల్వామా, పఠాన్‌కోట్ దాడుల సూత్రధారి అయిన అజార్ ఆపరేషన్ సిందూర్‌లో కుటుంబ సభ్యులను కోల్పోగా.. ఇప్పుడు పాక్ ఇతడిపై భారీ రివార్డు ప్రకటించడం గమనార్హం.





