
పండగలొచ్చాయంటే చాలు.. బస్టాండులు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిలాడటం మాములే. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఊళ్లకు వెళ్లే బస్సుల సంగతి చెప్పాల్సిన పని లేదు. అందులోనూ ఆర్టీసీ బస్సుల్లో వేరే లెవెల్లో ఉంటుంది పరిస్థితి. ఈ మధ్య ఆర్టీసీ బస్సుల్లో సీటు కోసం మహిళలు గొడవపడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి. ఆదివారం ( సెప్టెంబర్ 13 ) ఇలాంటి మరో ఘటన చోటు చేసుకుంది.పరిగి నుంచి హైదరాబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సులో సీటు కోసం మహిళలు జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..
పరిగి నుండి హైదరాబాద్ వెళ్తున్న బస్సులో సీటు కోసం నలుగురు మహిళలు జుట్లు పట్టుకొని కొట్టుకుంటూ తోటి ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేశారు. ఒకే మహిళపై ముగ్గురు మహిళలు కలిసి కొట్టుకుంటున్న దృశ్యాలను తోటి ప్రయాణికులు విడియో తీశారు.ఆ విడియో సోషల్ మిడియాలో వైరల్ గా మారింది.
సీటు కోసం మహిళలు గొడవపడటం తమను ఇబ్బందికి గురి చేసిందని అంటున్నారు ప్రయాణికులు. ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకం ఇలాంటివారి వల్ల నవ్వులపాలు అవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మహిళలు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.






