
GV Prakash Kumar | సంగీత దర్శకుడిగా, నటుడిగా టాలీవుడ్ మరియు కోలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జి.వి. ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar) నటిస్తున్న తాజా చిత్రం ‘ఇమ్మోర్టెల్’ (Immortal). తాజాగా ఈ సినిమాకు సంబంధించిన తెలుగు ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. మారీయప్పన్ చిన్న దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే తమిళంలో విడుదలై ఘనవిజయం సాధించగా తాజాగా తెలుగులో సెప్టెంబర్ 19న విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రంలో కాయదు లోహర్ (Kayadu Lohar) హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాకు సామ్ సి.ఎస్ (Sam CS) సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ ట్రైలర్ చూస్తే.. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. ప్రారంభంలో జి.వి. ప్రకాష్ కుమార్ మరియు కాయదు లోహర్ మధ్య లవ్ స్టోరీగా అనిపించినా, ఆ తర్వాత కథ పూర్తిగా ఒక రహస్యమైన మలుపు తిరుగుతుంది. ఈ చిత్రంలో కథాంశం మరణం లేని ఒక రహస్య వ్యక్తి చుట్టూ తిరుగుతున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. సామ్ సి.ఎస్ అందించిన నేపధ్య సంగీతం (BGM) మరియు విజువల్స్ ప్రేక్షకులను భయపెడుతూనే, సినిమాపై భారీ అంచనాలను పెంచుతున్నాయి.





