

Russian Drone Hits Train : యుక్రెయిన్–పోలాండ్ సరిహద్దు సమీపంలో రష్యా డ్రోన్ ప్రయాణికుల రైలును ఢీకొట్టడం తీవ్ర కలకలం రేపింది. అయితే, అసలు ట్విస్ట్ అక్కడే ఉంది.. డ్రోన్ దాడికి కొద్ది నిమిషాల ముందే అదే మార్గంలో యూరోపియన్ ప్రముఖులు ప్రయాణించారు. మాజీ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, మాజీ స్వీడన్ ప్రధాని కార్ల్ బిల్డ్ట్ సహా పలువురు దౌత్య ప్రతినిధులు ఆ మార్గం గుండా వెళ్లారు. వారు వెళ్లిన వెంటనే మరో రైలుపై డ్రోన్ దాడి జరగడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే, ఇది కేవలం రైలు ప్రమాదమా..? లేక భారీ కుట్రకు సంకేతమా..? అసలు ఆ డ్రోన్ లక్ష్యం ఎవరు..? దాడి వెనుక రష్యా వ్యూహం ఏమిటి..? అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రపంచ వ్యాక్తంగా సంచలనంగా మారాయి.
బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రయాణిస్తున్న రైలు వెళ్లిన కొద్ది నిమిషాల వ్యవధిలోనే యుక్రెయిన్ లో రైలుపై రష్యా డ్రోన్ దాడి జరగడం చర్చనీయాంశంగా మారింది. స్టేషన్ లో రైలు ఇంజిన్ ను డ్రోన్ ఢీకొట్టింది. పోలాండ్ సరిహద్దుకు రెండు కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో బోరిస్ జాన్స్ కు తృటిలో ప్రమాదం తప్పినట్లయింది.
డ్రోన్ దాడి జరిగిన వెంటనే అప్రమత్తమైన లోకో పైలెట్లు ప్రయాణికులను రైలు నుంచి దించేశారు. యహోదిన్ స్టేషన్ వద్ద జరిగిన ఈ దాడిలో రైలు ఇంజిన్ దెబ్బతింది. అయితే, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్థానిక అధికారులు తెలిపారు. కీవ్ లో జరిగిన సదస్సు ముగించుకొని బోరిస్ జాన్సన్ తో పాటు బ్రిటన్ కు చెందిన జోనాథన్ పావెల్ తదితర యూరోపియన్ జాతీయ భద్రతా సలహాదారులు వేరే రైలులో ఇదే మార్గంలో ప్రయాణించారు. ఈ దాడిపై రష్యా స్పందించింది. పశ్చిమ యుక్రెయిన్ లోని రైల్వే మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకొని ఈ దాడి చేసినట్లు ప్రకటించింది.
అయితే, ఈ ఘటనపై మాజీ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తీవ్రంగా స్పందించారు. ఉక్రెయిన్లో సాధారణ పౌరులు ప్రతిరోజూ ఎదుర్కొంటున్న దాడులకు ఇది మరో ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. మాజీ స్వీడన్ ప్రధాని కార్ల్ బిల్డ్ట్ దాడి అనంతరం ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
This wasn’t our train, but the one just minutes after us by the
border crossing. It was evacuated as the
drone approached and no one was hurt. Very good safety system. Our train just had an evacuation warning but could proceed to Dorohusk. The
attacks against
are…
— Carl Bildt (@carlbildt) September 13, 2026
border crossing. It was evacuated as the
drone approached and no one was hurt. Very good safety system. Our train just had an evacuation warning but could proceed to Dorohusk. The
are…