

Debjani Emotional Bigg Boss Promo 3 : బిగ్‌బాస్ తెలుగు సీజన్10లో సీరియల్ నటి దేబ్జానీ ఎమోషన్ అయింది. టాస్క్‌లో ఓడిపోవడంతో ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. ఈ రోజు ఎపిసోడ్‌కు సంబంధించిన మూడో ప్రొమోను విడుదల చేశారు.
బాగా ఫైట్ చేశావు గానీ, నువ్వు గెలిచే గేమ్ కాదు ఇది. వాళ్ల ముగ్గురికి బలం ఎక్కువగా ఉందని కృష్ణుడు దేబ్జానీతో అంటాడు. ఆ తరువాత ఆమె బెడ్ పై కూర్చుని భావోద్వేగానికి గురైంది. తనలో తానే మాట్లాడుకుంది. తల రాత రాసిపెట్టి ఉంటే జరుగుతుంది, ఎంత ట్రై చేసినా ఏం లాభం లేకపోయిందని చెప్పుకొచ్చింది. ఆ తరువాత జరిగిన ఘటనలను గుర్తు తెచ్చుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది.