

Aamir Khan : వరుస విజయాలతో షారుఖ్ ఖాన్, సాలిడ్ కంబ్యాక్ కోసం సల్మాన్ ఖాన్.. ఇలా ఈ ఇద్దరు ఖాన్ హీరోలు టేకప్ చేసిన సినిమాలని పరుగులు పెట్టిస్తున్నారు. అయితే ఈ ఖాన్స్ త్రయంలో ఒకరైన ఆమీర్ ఖాన్ మాత్రం ఈ విషయంలోనే కాస్త స్లో అయ్యారు. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్‌కి ఇప్పుడు టైమ్ ఏ మాత్రం కలిసిరావడం లేదు.
వరుస ఫెయిల్యూర్స్ ఈ బాలీవుడ్ స్టార్ కెరీర్‌ని ఇబ్బందుల్లో పడేశాయి. ఎక్స్పర్మెంటల్ సినిమాలతో పాటు ఇటు నిర్మాతగా చేసిన సినిమాలు సైతం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అనిపించుకున్నాయి. నిజానికి 2016లో వచ్చిన దంగల్ మూవీ తర్వాత ఆమీర్ ఖాన్ ఖాతాలో ఒక్క హిట్టు కూడా లేదు. భారీ అంచనాలతో వచ్చిన లాల్ సింగ్ చద్దా సినిమా సైతం డిజాస్టర్ అనిపించుకుంది. ఆ తర్వాత మెయిన్ లీడ్ లో ఒక్క సినిమా కూడా చేయలేదు. లాస్ట్ ఇయర్ వచ్చిన సితారే జమీన్ పర్ ఓకే అనిపించినా తారే జమీన్ పర్ రేంజ్ టాక్ మాత్రం రాలేదు. 2016 నుంచి హీరోగా మూడు సినిమాలే వచ్చాయి. మిగిలినవి అన్ని క్యామియోలు, నిర్మాతగా చేసిన సినిమాలే. అవి కూడా హిట్ అవ్వలేదు. సౌత్ లో రజినీకాంత్ కూలి సినిమాలో గెస్ట్ రోల్ చేసాడు. ఆ సినిమా కూడా యావరేజ్ గానే నిలిచింది.
Also Read : Jabardasth Naresh : బిగ్ బాస్‌లో జబర్దస్త్ నరేష్ ఏజ్ బయటపెట్టిన రామ్ ప్రసాద్.. పెళ్లి సంబంధాలు అంటూ..
ఒకప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో దంగల్, పీకే, త్రీ ఇడియట్స్.. లాంటి ఇండస్ట్రీ హిట్స్‌తో బాలీవుడ్‌ను రూల్ చేసిన అమీర్ ఖాన్ ఇప్పడు ఫ్లాపుల్లో మునిగిపోయారు. తన సినిమాలతో వందల కోట్లు కొల్లగొట్టిన ఈ బాలీవుడ్ స్టార్ హీరో ప్రస్తుతం గ్రేట్ కంబ్యాక్ కోసం సరైన ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకునే ఆలోచనలో పడినట్లుగా తెలుస్తోంది. హీరోగా గ్యాప్ ఇచ్చి నిర్మాతగా చేసిన సినిమాలు.. హ్యాపీ పటేల్ ఖతర్నాక్ జాసూస్, కొడుకు జునైద్ ఖాన్‌ను హీరోగా పరిచయం చేస్తూ చేసిన ఏక్ దిన్, సన్నీడియోల్ నటించిన బట్వారా1947 సినిమాలు కూడా ఈ ఇయిర్ ఆమీర్ ఖాన్ ఫ్లాప్లిస్ట్లో చేరాయి.
వరుస పరాజయాలతో కెరీర్ గాడి తప్పడంతో, ఈసారి ఎలాగైనా బ్లాక్బాస్టర్ కొట్టాలని ప్లాన్ చేస్తున్నారు ఆమీర్ ఖాన్. ప్రజెంట్ ట్రెండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఒక సూపర్ హీరో కాన్సెప్ట్‌తో ఓ భారీ యాక్షన్ ఎంటర్టైనర్కి రెడీ అవుతున్నట్లు బాలీవుడ్ మీడియాలో న్యూస్ వైరలవుతోంది. ఈ సినిమాని ఆర్. బాల్కి డైరెక్ట్ చేస్తారని, సాజిద్ నడియాడ్వాలా ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.
అయితే కూలీ సినిమా తర్వాత సూపర్ హీరో కాన్సెప్ట్‌తోనే డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్‌తో సినిమా చేయాలి ఆమీర్. కానీ ఆ ప్రాజెక్ట్‌కి సంబంధించిన స్క్రిప్ట్ ఇంకా రెడీ కాలేదని, లైన్ వినిపించగా ఆమీర్ మాత్రం ఆసక్తి చూపినట్లుగా తెలుస్తోంది. మరి ఆమిర్ ఖాన్ ఏ సినిమాతో వస్తాడో. ఎలాంటి సూపర్ హీరోగా వస్తాడో చూడాలి. మళ్ళీ హిట్ కొట్టి కంబ్యాక్ ఇస్తాడా చూడాలి.