
Gold silver rate today: యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను పెంచుతుందన్న అంచనాలతో బంగారం ధరలు దేశీయ మార్కెట్లో అలాగే అంతర్జాతీయంగా భారీగా దిగొస్తున్నాయి. భారత కాలమానం ప్రకారం ఫెడ్ నుంచి ప్రకటన బుధవారం అర్ధరాత్రి 12 గంటలకు రానుంది. ఫెడ్ వడ్డీ రేట్లు పెంచితే బంగారం రేట్లు మరింత పతనం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. సెప్టెంబర్ 16 గోల్డ్, సిల్వర్ రేట్ల గురించి ఇప్పుడు చూద్దాం.




