
GHMC Labour | రేవంత్ సర్కార్ పారిశుద్ధ్య కార్మికులను రాంకీ అనే ప్రైవేట్ సంస్థకు అప్పగించడాన్ని నిరసిస్తూ అసెంబ్లీ ముట్టడించిన చెత్త సేకరణ కార్మికులను అరెస్ట్ చేసిన పోలీసులు ఎల్బీ స్టేడియంలో నిర్బంధించారని తెలిసిందే. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ కార్మికులు ప్రభుత్వ వైఖరిపై మండిపడుతున్నారు. ఓ సీనియర్ జీహెచ్ఎంసీ కార్మికుడు మీడియాతో మాట్లాడుతూ.. 30-40 ఏళ్ల నుండి చెత్త బండ్లు నడుపుతూ మా జీవనోపాధితో పిల్లలను చదివించుకుని బతుకుతున్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి రాంకీ సంస్థకు కాంట్రాక్ట్ ఇస్తామంటే ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించాడు. కేసీఆర్ ఆటోరిక్షాలు ఇచ్చినప్పటి నుంచి వాటితో చెత్త సేకరించి మా జీవనోపాధి కొనసాగిస్తున్నాం. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి వచ్చి రాంకీకి అప్పగిస్తామని ఎంతవరకు సరైందని ఫైర్ అయ్యాడు. 60 వేల కుటుంబాలను రోడ్లపాలు చేస్తా అని అంటడు. దాని వల్ల ఎవరికి న్యాయం జరుగలేదు.. ఇది ప్రశ్నించాలి. కేవలం మాటల వరకే ప్రజావాణి. ప్రజాపాలన లేదు.. ఏం లేదు మార్పులేదు. రేవంత్ రెడ్డి 60 వేలు-లక్ష కుటుంబాలను రోడ్లపైకి తీసుకొచ్చేందుకు మార్పు తీసుకొచ్చిండు. తెలంగాణ ఉద్యమం ఎట్లా నడిచిందో అట్లా మా కార్యాచరణ నడుస్తది. అవసరమైతే ప్రాణాలైనా తీసుకుంటాం.. కానీ వేరే విషయాలను ఒప్పుకోమని స్పష్టం చేశారు. ఈ చెత్తను రోడ్లమీద పోసుడా.. ఎట్లా నిరసన తెలియజేస్తమంటే వాళ్లకు కనువిప్పు కావాలి.. అప్పటిదాకా మా నిరసన తెలియజేస్తామని పేర్కొన్నాడు. 30-40 ఏళ్ల నుండి చెత్త బండ్లు నడుపుతున్నాం ఇప్పుడొచ్చి రేవంత్ రెడ్డి వచ్చి రాంకీ సంస్థకు కాంట్రాక్ట్ ఇస్తామంటే ఎట్ల సమంజసం కేసీఆర్ దయ తోటి ఆటోలు ఇస్తే వాటితో చెత్త సేకరించి జీవనం సాగిస్తున్నాం రాంకీ సంస్థకు చెత్త సేకరించే కాంట్రాక్ట్ ఇస్తే హైదరాబాద్ రోడ్ల మీద చెత్త పోసి నిరసన… https://t.co/ZNeylZg7TX pic.twitter.com/LYVvGJ26F3 — Telugu Scribe (@TeluguScribe) September 14, 2026 Walking vs Yoga | నడక మంచిదా.. యోగా మంచిదా? మీ ఆరోగ్యానికి ఏది సరైనదో తెలుసుకోండి





