
బ్యాంకింగ్‌ వ్యవస్థలో అదనపు నగదు లభ్యత (లిక్విడిటీ) అధికంగా ఉండటంతో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) బుధవారం రెండు ‘వేరియబుల్‌ రేట్‌ రివర్స్‌ రెపో’ (వీఆర్‌ఆర్‌ఆర్‌) వేలం ప్రక్రియ ద్వారా రూ.2.90 లక్షల కోట్లను వెనక్కి తీసుకుంది. మొదటి వీఆర్‌ఆర్‌ఆర్‌ వేలంలో మొత్తంగా రూ.2.50 లక్షల కోట్లను నోటిఫై చేయగా, రూ.3,17,088 కోట్ల విలువైన బిడ్‌లు వచ్చాయి. ఇందులో రూ.2,50,025 కోట్ల బిడ్‌లనే ఆర్‌బీఐ స్వీకరించింది. మరొక వీఆర్‌ఆర్‌ఆర్‌ వేలంలో రూ.1 లక్ష కోట్ల నోటిఫై మొత్తానికి గాను రూ.40,302 కోట్లకే బిడ్‌లు వచ్చాయి. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





